భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. భాజపాలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఇవాళ దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గవర్నర్‌తో భేటీ..
అంతకుముందు ఆదివారం సాయంత్రం.. బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్తో భేటీ అయ్యారు గంగూలీ. ఈ మాజీ క్రికెటర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలవడం చర్చనీయాంశమైంది.
అయితే రాజ్‌భవన్ వర్గాలు మాత్రం గంగూలీ.. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిశారని, ఇందులో రాజకీయపరమైన అంశాలకు తావులేదని పేర్కొన్నాయి. గవర్నర్ కూడా కాసేపటికే ట్వీట్ చేశారు. పురాతన క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించాలని గంగూలీ కోరారని, అందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.