sorry painted in college: కర్ణాటక బెంగళూరులోని సుంకదకట్టె ప్రాంతంలో కొంతమంది ఆకతాయిలు చేసిన పని పోలీసులకు తలనొప్పులు తెచ్చి పెట్టింది. సుంకదకట్టెలోని ఓ ప్రైవేట్ కళాశాల గోడలు, మెట్లతో పాటు పాఠశాల చుట్టూ ఉన్న వీధుల్లో కొంతమంది ఆకతాయిలు సారీ..సారీ.. అంటూ పెయింట్‌తో రాశారు. ఉదయాన్నే చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కాలేజీలో ఎక్కడ చూసినా 'సారీ.. సారీ'.. ఆమె కోసమే! - కర్ణాటక న్యూస్
కర్ణాటక బెంగళూరులోని ఓ కళాశాల ప్రాంగణమంతా సారీ.. సారీ అనే పెయింటింగ్‌లతో నింపేశారు ఆకతాయిలు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి రాసినట్లు గుర్తించారు. అదే కళాశాలలో చదివే ఓ అమ్మాయి కోసమే వారు ఇలా చేసి ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు.
sorry painted in college
కళాశాలకు చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఓ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి.. కళాశాల గోడల మీద, చుట్టుపక్కల వీధుల్లో సారీ..సారీ.. అంటూ రాసినట్లు ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి:మరో పరువు హత్య.. 'నాన్నా.. నన్ను చంపొద్దు ప్లీజ్'.. ఆడియో వైరల్
Last Updated : May 25, 2022, 2:06 PM IST