బాలీవుడ్ స్టార్ సోనూసుద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే కరోనా సమయం నుంచి ఎన్నో లక్షల మందికి అండగా నిలిచిన ఆయన.. తాజాగా భిక్షాటన చేస్తూ జీవినం సాగిస్తున్న దివ్యాంగుడైన ఇండియన్ ఐడల్ సింగర్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఓ ప్రైవేటు స్కూల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తానని హామి ఇచ్చారు.ఝార్ఖండ్‌కు చెందిన మక్సూద్ అనే దివ్యాంగుడు.. 2017 ఇండియన్ ఐడల్ సింగర్ పోటీల్లో సైతం పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం తన పరిస్థితి బాగో లేక బొకారో జిల్లాలో వీధుల వెంట భిక్షాటన చేస్తూ జీవినం సాగిస్తున్నారు. తన గాత్రాన్ని ప్రజలకు వినిపిస్తు సాయం కోసం కోరుతున్నారు. దీంతో అతడి గురించి సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.
మరోసారి సోనుసూద్ దాతృత్వం.. బిక్షాటన చేస్తున్న సింగర్‌కు ఉద్యోగ హామీ
సోనుసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఝార్ఖండ్ వీధుల వెంట బిక్షాటన చేస్తున్న ఇండియన్ ఐడియల్ సింగర్‌కు ఉద్యోగం ఇచ్చేందుకు హామి ఇచ్చారు.
'సోనుసూద్ నుంచి ఉద్యోగ ఆఫర్ వచ్చింది నిజమే. జీతం విషయంలో ఇంకా తెలియాల్సి ఉంది. సంగీతంతో జీవించడమే నా కల, మళ్లీ ఇండియన్ ఐడల్ సింగర్ షోలో పాల్గొనాలని ఆశగా ఉంది. రాష్ట్ర, జిల్లా స్థాయి నుంచి పురస్కారాలు అందుకోవాలని ఉంది. 2017లో ఇండియన్ ఐడల్ సింగర్ షోలో 24వ రౌండ్ వరకు వెళ్లగలిగాను. తరువాత ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ సురేశ్ వాడేకర్ వద్ద పాడటంలో మెలుకువలు నేర్చుకున్నా. కరోనా కారణంగా ఇంటికి తిరిగివచ్చాను. ప్రస్తుతం నా సహచరులతో ఉదయం బొకారో నగరానికి వచ్చి పలు విధుల్లో భిక్షాటన చేసి సాయంత్రం ఇంటికి వెళ్తున్నా'
-- మక్సూద్, దివ్యాంగుడు