SonuSood Helps Child: పుట్టుకతోనే నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన బిహార్‌కు చెందిన ఓ చిన్నారికి వైద్యం చేయిస్తానన్న నటుడు సోనూసూద్.. తన మాట నిలబెట్టుకున్నారు. ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఎంతో కష్టంతో కూడుకున్న ఈ శస్త్రచికిత్సను సూరత్‌లోని కిరణ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్స పూర్తి చేసేందుకు వైద్యులు పలు గంటలు శ్రమించారు. ఇలా అదనపు అవయవాలతో జన్మించడాన్ని పాలీమెలియా అంటారని వైద్యులు వివరించారు. తమ బిడ్డ వైద్యానికి సహాయం చేసిన సోనూసూద్ తమకు దేవుడు అని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.
చిన్నారికి అండగా సోనూ.. శస్త్రచికిత్సతో కొత్త జీవితం - సోనూసూద్ సాయం
SonuSood Helps Child: బిహార్‌లో నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన చిన్నారికి నటుడు సోనూసూద్ కొత్త జీవితాన్ని అందించారు. సూరత్‌లోని కిరణ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తిచేశారు. తమ కుమార్తె వైద్యానికి సాయం చేసిన సోనూసూద్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
బిహార్‌కు చెందిన చౌముఖి కుమారి అనే చిన్నారి.. పుట్టుకతోనే నాలుగు కాళ్లు, చేతులతో జన్మించింది. నిరుపేద కుటుంబం కావడం వల్ల చిన్నారికి చికిత్స అందించే ఆర్థిక స్తోమత లేక ఆమె తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడ్డారు. చిన్నారి కుటుంబంలో ఆమె అక్క తప్ప మిగతా అందరూ అంగవైకల్యంతో జన్మించినవారే. చిన్నారి తల్లిదండ్రులు.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తున్నారు. అయితే తమ చిన్నారి వైద్యానికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న సోనూసూద్.. సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. చికిత్స కోసం పాపను ముంబయి తీసుకురావాలని కోరారు. ముంబయి చేరుకున్న ఆ చిన్నారిని కలిసిన సోనూసూద్.. శస్త్రచికిత్స కోసం సూరత్‌కు తీసుకెళ్లారు.
ఇదీ చదవండి:సూసైడ్ చేసుకుంటానని కొండ ఎక్కిన యువతి.. ఎస్ఐ ఎంట్రీతో..