- రూ.12,69,902... దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ భవనం అద్దె బకాయి.
- రూ.4,601.. సోనియా గాంధీ అధికారిక నివాసం అద్దె బాకీ.
- రూ.5,07,911.. సోనియా వ్యక్తిగత కార్యదర్శి నివాసం అద్దె బకాయి.
సుజిత్ పటేల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ చెప్పిన లెక్కలివి.
పదేళ్లుగా అద్దె కట్టని కాంగ్రెస్
Congress Office rent due: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం.. దిల్లీ అక్బర్ రోడ్‌లోని 26వ నెెంబర్ భవనంలో ఉంది. 2012 డిసెంబర్ తర్వాత ఆ భవనం అద్దెను చెల్లించలేదు కాంగ్రెస్. మొత్తం రూ.12లక్షలకుపైగా బకాయి పడింది.
జాతీయ, రాష్ట్ర పార్టీలకు ప్రభుత్వ భవనాల కేటాయింపునకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆయా పార్టీలు సొంత భవనం కట్టుకునేందుకు మూడేళ్లు సమయం ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే.. 2010 జూన్‌లోనే దిల్లీ రౌజ్ ఎవెన్యూలో కాంగ్రెస్ పార్టీకి భూకేటాయింపు జరిగింది. అయినా.. భవన నిర్మాణం పూర్తి కాలేదు. 2013లోనే అక్బర్ రోడ్ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఖాళీ చేయాల్సి ఉంది. అయితే.. అనేక సార్లు ఆ గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది ఆ పార్టీ.
2020 జులైలో లోధి రోడ్‌లోని ప్రభుత్వ భవనాన్ని నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్రం నోటీసులిచ్చింది. ఫలితంగా అప్పుడు ప్రియాంక వేరే ఇంటికి మారాల్సి వచ్చింది.