దేశంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని సూచించారు. చికిత్సకు సరిపడ అత్యవసర ఔషధాలను సరఫరా చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
" బ్లాక్ ఫంగస్‌ను సాంక్రమిక చట్టం కింద పరిగణించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. దీని అర్థం.. వ్యాధిని అరికట్టేందుకు సరిపడ ఔషధాలు ఉత్పత్తి, సరఫరా అవసరం. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలి. ఈ వ్యాధిని ఆయుష్మాన్ భారత్కింద చేర్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోండి."