కేంద్రంలోని మోదీ సర్కార్ను ఇరుకున పెట్టేలా.. విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కసరత్తు ముమ్మరం చేశారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, నేతలతో సోనియా విందు సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ సమావేశం లక్ష్యమని స్పష్టం చేశాయి.
ఆ సీఎంలకు సోనియా విందు- అసలు లక్ష్యం అదే! - సోనియా గాంధీ విపక్ష సమావేశం
విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విపక్ష నేతలకు విందు ఇవ్వాలని సోనియా గాంధీ యోచిస్తున్నట్లు సమాచారం. బంగాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు కీలక నేతలు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది.
సోనియా గాంధీ
ఈ సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సహా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర సీఎంలను ఆహ్వానించాలని సోనియా యోచిస్తున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి: