నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యేందుకు మరో మూడు వారాల గడవు కోరారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఇటీవల కరోనా బారిన పడిన సోనియా.. ఇంకా కోలుకోని కారణంగా ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారని.. విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు పేర్కొన్నాయి. నిజానికి సోనియా బుధవారమే ఈడీ ఎదుట హాజరు కావాలి. మరోవైపు అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈనెల 2నే విచారణకు హాజరుకావాల్సింది. కానీ విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేనని రాహుల్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈనెల 13న విచారణకు హాజరవ్వాలని ఈడీ తెలిపింది. సోనియా విజ్ఞప్తిపై ఆ సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.
'నాకు మరో మూడు వారాలు గడువు కావాలి'.. ఈడీకి సోనియా విజ్ఞప్తి - ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ
ఈడీ విచారణకు హాజరయ్యేందుకు మరో మూడు వారాలు గడువు కావాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 13న విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది.
నేషనల్ హెరాల్డ్ కేసు ఇదే: కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.
ఇదీ చూడండి :మత్తులో గూడ్స్ ట్రైన్ పైకెక్కి.. 220 కి.మీ. ప్రయాణం.. పక్క రాష్ట్రానికి వెళ్లాక..