తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్ అధ్యక్షుడు అయ్యేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు' - కాంగ్రెస్​ అధ్యక్షురాలు ఈటీవీ భారత్​

Sonia Gandhi meeting with Congress leaders Live upates
అసంతృప్తి నేతలతో కాంగ్రెస్​ అధ్యక్షురాలు భేటీ

By

Published : Dec 19, 2020, 10:22 AM IST

Updated : Dec 19, 2020, 4:44 PM IST

16:43 December 19

  • కొత్త అధ్యక్ష ఎంపిక మొదలైందన్న సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్
  • ఇదే తరహాలో మరికొన్ని భేటీలు జరుగుతాయన్న పృథ్వీరాజ్ చౌహాన్
  • పార్టీ బలోపేతానికి మరిన్ని చర్చలు జరుగుతాయన్న హరీశ్‌ రావత్
  • పార్టీ పెండింగ్ అంశాలపై చింతన్ శిబిర్‌లో చర్చించనున్న నేతలు
  • త్వరలోనే చింతన్ శిబిర్‌ జరుగుతుందన్న పవన్ బన్సల్
  • రాహుల్ అధ్యక్షుడు అయ్యేందుకు ఎవరికీ అభ్యంతరం లేదన్న బన్సల్
  • సోనియాతో 5 గంటలపాటు జరిగిన కాంగ్రెస్ సీనియర్‌ నేతల భేటీ
  • సోనియా వద్ద తమ అభిప్రాయాలు వెల్లడించిన సీనియర్ నేతలు
  • రాహుల్‌కు అధ్యక్ష బాధ్యతల విషయాన్ని ప్రస్తావించిన సీనియర్‌ నేతలు
  • సమావేశం ఆఖరున రాహుల్ అధ్యక్ష బాధ్యతలపైనే చర్చించినట్లు సమాచారం
  • పార్టీ ఇచ్చే ఏ బాధ్యతనైనా తీసుకునేందుకు రాహుల్ సిద్ధమన్నారన్న నేతలు

12:03 December 19

దేనిపై చర్చ?

కాంగ్రెస్ అసంతృప్త నేతలతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశం అయ్యారు. దిల్లీలోని టెన్ జన్‌పథ్‌లోని ఆమె నివాసంలో పార్టీ ముఖ్యనేతలు  భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రాతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, సీనియర్‌ నేతలు, గులాం నబీ ఆజాద్, భూపిందర్ సింగ్ హుడా, అంబికా సోనీ,  ఆనంద్ శర్మ సహా పలువురు నేతలు హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో అసమ్మతి నేతలు లేవనెత్తిన అంశాలతోపాటు.. పార్టీ ప్రక్షాళన, సంస్థాగత ఎన్నికలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. 

వచ్చే జనవరిలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగవచ్చని చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది. రాహుల్‌కు పార్టీ పగ్గాలు తిరిగి అప్పగించడానికి ప్రణాళిక ప్రకారమే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి

11:34 December 19

భేటీకి హాజరైంది వీరే..

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​, పి.చిదంబరం, వివేక్​ టంకా, భూపిందర్​ సింగ్​ హుడా, పృథ్వీరాజ్​ చవాన్​, అంబికా సోనీ, మనీశ్​ తివారీ, గులాం నబీ ఆజాద్​, పవన్​ బన్సల్​, హరీశ్​ రావత్​, ఆనంద్​ శర్మ, శశిథరూర్​, ఏకే ఆంటోనీ సహా పలువురు నేతలు హాజరయ్యారు. 

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, సీనియర్​ నేత అజయ్​ మాకెన్​, రాహుల్​ గాంధీ కూడా జన్​పథ్​కు చేరుకున్నారు. 

11:26 December 19

అసంతృప్త నేతలతో సోనియా భేటీ..

  • కాంగ్రెస్ అసంతృప్త నేతలతో సోనియాగాంధీ సమావేశం
  • పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలతో సోనియా భేటీ
  • ఇటీవల లేఖ రాసిన జీ-23 నేతల్లో కొందరు హాజరు
  • సమావేశానికి హాజరైన రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ
  • అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల లేఖలు రాసిన సీనియర్ నేతలు
  • పార్టీలో ప్రక్షాళన జరగాలంటూ లేఖ రాసిన పలువురు సీనియర్‌ నేతలు
  • పార్టీ ప్రక్షాళనతో పాటు సంస్థాగత ఎన్నికలపై చర్చించే అవకాశం
  • సమావేశానికి హాజరుకానున్న రాహుల్‌ గాంధీ

10:23 December 19

సోనియాతో గహ్లోత్​ భేటీ..

  • రాజస్థాన్ మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు సమాచారం.
  • ఈ వ్యవహారంపై చర్చించేందుకు.. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ నివాసానికి చేరుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్​.
  • గహ్లోత్​తో పాటు సోనియా నివాసానికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్​నాథ్.

10:08 December 19

సోనియా సమావేశం..

  • కాంగ్రెస్​లో ప్రక్షాళన జరగాలన్న సీనియర్ నేతలతో ములాఖాత్ కానున్న సోనియాగాంధీ.
  • పార్టీ అధినాయకత్వం, పనితీరు, నాయకత్వ మార్పుపై లేఖ రాసి అసంతృప్తి వ్యక్తం చేసిన 23 నేతలతో నేడు భేటీ కానున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.
  • జి23(గ్రూప్23)గా పేరు పొందిన నేతలతో ఉదయం 11గం.లకు భేటీ
  • సీనియర్ నేతలు గులాంనబీ అజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబ్బల్, శశిథరూర్ సహా అసంతృప్త నేతలంతా హాజరుకానున్నట్లు సమాచారం.
  • భేటీలో సోనియాగాంధీ తో పాటు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఉండే అవకాశం.
  • లేఖ రాయడానికి, అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణాలను సోనియాకు వివరించనున్న నేతలు
  • పార్టీ బలోపేతం చేయడం, సంస్థాగత వ్యవహారాలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు వంటి విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిపిన ఏఐసీసీ వర్గాలు
Last Updated : Dec 19, 2020, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details