తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్​తో..! - సోనియా గాంధీ ఇన్ఫెక్షన్

కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ దిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆమె బుధవారం హాస్పిటల్​లో చేరినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. కొంతకాలంగా ఆమె శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్​తో బాధపడుతున్నట్లు వెల్లడించాయి.

sonia gandhi medical treatment
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

By

Published : Jan 4, 2023, 2:21 PM IST

Updated : Jan 4, 2023, 2:46 PM IST

కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ దిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆమె బుధవారం హాస్పిటల్​లో చేరినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. కొంతకాలంగా ఆమె శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్​తో బాధపడుతున్నట్లు వెల్లడించాయి.
మంగళవారం నుంచి సోనియా అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది. అందుకే ఉత్తర్​ప్రదేశ్​లో భారత్​ జోడో యాత్రలో ఏడు కిలోమీటర్లు నడిచాక.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిల్లీకి తిరిగి వచ్చారని సమాచారం. బుధవారం ప్రియాంక దగ్గరుండి సోనియాను ఆస్పత్రికి తీసుకెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సోనియా గాంధీ గతేడాది రెండుసార్లు కరోనాబారిన పడ్డారు. జూన్‌లో ఓసారి, ఆగస్టులో మరోసారి ఆమెకు కొవిడ్ సోకింది. ఫలితంగా కొవిడ్ అనంతర సమస్యలు తలెత్తాయి. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావమైంది. అప్పుడు సైతం సర్ గంగా రామ్ ఆస్పత్రిలోనే చేరారు. శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స తీసుకున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యారు.

Last Updated : Jan 4, 2023, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details