Sonia Gandhi Mamata Banerjee: పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. ఎన్సీపీ, డీఎంకే, శివసేన, సీపీఎం నేతలతో తన నివాసంలో భేటీ అయిన సోనియా.. 12 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేసిన వ్యవహారంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో పాటు శివసేన నేత సంజయ్ రౌత్, డీఎంకే నేత టీఆర్ బాలు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు హాజరైనట్టు తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుతో శరద్ పవార్ మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేలా చూడాలని ఈ భేటీలో నేతలు నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు, కాంగ్రెస్‌తో విభేదిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌ను ఈ భేటీకి ఆహ్వానించలేదని తెలుస్తోంది.
విపక్ష నేతలతో సోనియా భేటీ.. దీదీకి అందని ఆహ్వానం! - కాంగ్రెస్ నేత సోనియా గాంధీ
Sonia Gandhi Mamata Banerjee: రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్కు సంబంధించి విపక్ష నేతలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో విభేదిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌ను ఈ భేటీకి ఆహ్వానించలేదని తెలుస్తోంది.
గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలు పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలను ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ అంశంపై అప్పట్నుంచి విపక్ష పార్టీలు నిరసన వ్యక్తంచేస్తూ పార్లమెంట్ ఉభయసభల కార్యకలాపాల్ని స్తంభింపజేస్తున్నాయి. దీంతో అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభ వాయిదాల పర్వమే నడుస్తోంది. అయితే, ఆ ఎంపీలు తమ ప్రవర్తనకు క్షమాపణలు చెప్పేదాకా వెనక్కి తగ్గేదిలేదని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పింది. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన 12మంది ఎంపీల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఉండగా.. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఇదీ చూడండి :'ఆ దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి'