తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసంతృప్త నేతలతో భేటీ కానున్న సోనియా - అసంతృప్త నేతలు సోనియా భేటీ

కాంగ్రెస్​లో లోపాలపై విమర్శలు చేస్తూ లేఖ రాసిన సీనియర్​ నేతలతో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్చలు జరపనున్నారు. విపక్ష నేత గులాం నబీ ఆజాద్​ సహా పలువురితో వరుస భేటీలు నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పొత్తులపైనా చర్చిస్తారని స్పష్టం చేశాయి.

sonia-gandhi-finally-agrees-to-meet-congress-rebels
అసంతృప్త నేతలతో భేటీ కానున్న సోనియా

By

Published : Dec 18, 2020, 5:51 AM IST

Updated : Dec 18, 2020, 6:25 AM IST

కాంగ్రెస్‌లో సంస్థాగతంగా సమూల మార్పులు తీసుకురావాలంటూ లేఖాస్త్రాన్ని సంధించిన సీనియర్ నేతల్లోని కొందరితో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్చలకు సిద్ధమయ్యారు. ఈ నెల 19, 20 తేదీల్లో సోనియా వీరితో భేటీ కానున్నారు. వీరిలో రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ కూడా ఉంటారు.

ఆ రెండు రోజుల్లో పలువురు సీనియర్ నేతలతో వరుస భేటీలను సోనియా నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీకి సంబంధించి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నాయి.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించరాదన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో పొత్తులపై కూడా సోనియా చర్చిస్తారని వెల్లడించాయి.

ఇదీ చదవండి:కాంగ్రెస్​లో మళ్లీ అంతర్యుద్ధం- కారణం ఆ 'లేఖ'!

Last Updated : Dec 18, 2020, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details