కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో దిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేరిన ఆమె.. చికిత్స అనంతరం కోలుకున్నారు. మంగళవారం 3గంటల ప్రాంతంలో ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు గంగా రామ్ ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ తెలిపారు.
ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ - latest sonia gandhi news
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోగ్యం కుదుటపడింది. దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు ఆమెను మంగళవారం డిశ్చార్జ్ చేశారు.
జనవరి 3న సోనియా గాంధీ అనారోగ్యం పాలయ్యారు. జనవరి 4న ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సోనియా గాంధీ ఎట్టకేలకు కోలుకున్నారు. ఆరోగ్యం కుదుటపడటం వల్ల ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు.
సోనియా గాంధీ గతేడాది రెండుసార్లు కరోనాబారిన పడ్డారు. జూన్‌లో ఓసారి, ఆగస్టులో మరోసారి ఆమెకు కొవిడ్ సోకింది. ఫలితంగా కొవిడ్ అనంతర సమస్యలు తలెత్తాయి. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావమైంది. అప్పుడు సైతం సర్ గంగా రామ్ ఆస్పత్రిలోనే చేరారు. శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స తీసుకున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యారు.