బంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన మమత బెనర్జీ(టీఎంసీ), ఎంకే స్టాలిన్(డీఎంకే)లకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇద్దరు నేతలకు ఆమె ఆదివారం ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.
ఇదీ చదవండి:మినీ సార్వత్రికంలో మెరవని సినీ తారలు!
బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మొత్తం 294 అసెంబ్లీ సీట్లు కలిగిన ఆ రాష్ట్రంలో 292 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 213 సీట్లతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు దీదీ. ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డిన భాజపా 75 స్థానాలకు పరిమితమైంది.
ఇక.. 234 శాసనసభ స్థానాలు కలిగిన తమిళనాడులో పదేళ్లపాటు ప్రతిపక్ష హోదాలో ఉన్న డీఎంకే కూటమి 152 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. దీంతో డీఎంకే అధినేత స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిష్ఠించనున్నారు.
ఇదీ చదవండి:ఉప ఎన్నికల్లో.. వీరికి కొన్ని- వారికి కొన్ని