తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా ఎంపీ ల్యాడ్స్​ నిధులన్నీ కరోనా బాధితులకే' - సోనియాగాంధీ

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో తన ఎంపీల్యాడ్స్​ నిధులను కొవిడ్​ బాధితుల సంక్షేమం కోసం వినియోగించాలని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రాయ్​బరేలీ జిల్లా కలెక్టర్​కు సూచించారు. తన ఎంపీల్యాడ్స్ ఖాతాలో రూ. 1.17 కోట్లు మిగిలి ఉన్నట్లు తెలిపారు.

Sonia
సోనియా గాంధీ

By

Published : Apr 25, 2021, 4:48 AM IST

Updated : Apr 25, 2021, 6:15 AM IST

దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ తన ఎంపీ ల్యాడ్స్​ నిధులను ఉత్తర్​ప్రదేస్​ రాయ్​బరేలీలోని కొవిడ్ బాధితుల అవసరాల కోసం వినియోగించాలని జిల్లా కలెక్టర్​కు లేఖ రాశారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. తన ఖాతాలోని రూ. 1.17 కోట్లకు పైగా నిధులను అక్కడి ప్రజల సంక్షేమం కోసం వెచ్చించాలని సూచించారు.

"ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల అనేక మంది జీవితాలపై ప్రభావం పడింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రాయ్​బరేలీ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, ఆరోగ్యం కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులను వినియోగించాలని సిఫార్సు చేస్తున్నాను."

-- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

ఈ విషయంపై తనను మళ్లీ సంప్రదించాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు సోనియా.

ఇదీ చదవండి :సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ శాంతన​గౌడర్ కన్నుమూత

Last Updated : Apr 25, 2021, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details