తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అమ్మమ్మ ఇంటికి వెళ్తే మీకేంటి బాధ?' - వ్యవస్థాపక దినోత్సవానికి రాహుల్​ గైహాజరు

రాహుల్​ గాంధీ ఇటలీ పర్యటనపై భాజపా చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టింది కాంగ్రెస్​. వ్యక్తిగత విషయాలపై కమలదళం రాజకీయం చేస్తోందని మండిపడింది.

Sonia and Rahul absent for Congress foundation day
'అమ్మమ్మ ఇంటికి వెళ్తే మీకేంటి బాధ'

By

Published : Dec 28, 2020, 2:33 PM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై రాజకీయ దుమారం తీవ్రమవుతోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు దీక్షలు, కాంగ్రెస్​ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో రాహుల్​ విదేశాలకు వెళ్లడంపై భాజపా విమర్శలు చేయగా... కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు.

"రాహుల్ పర్యటన గురించి ముందే సమాచారం ఇచ్చాం. కొన్ని రోజులు పాటు ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటారని చెప్పాం. ఆయనో చిన్న పని మీద ఇటలీ వెళ్లారు. వీలైనంత త్వరగా వస్తారు."

-రణ్​దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్​ నేత

"రాహుల్​ వాళ్ల అమ్మమ్మను చూసేందుకు ఇటలీ వెళ్లారు. అందులో తప్పేముంది? ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత పనులు ఉంటాయి. దీనిని భాజపా రాజకీయం చేస్తోంది. రాహుల్​ లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం తగదు."

-కేసీ వేణుగోపాల్​, కాంగ్రెస్​ జనరల్​ సెక్రెటరీ

వారు లేకుండానే వ్యవస్థాపక దినోత్సవం..

కాంగ్రెస్​ 136వ వ్యవస్థాపక దినోత్సవం నాడు పార్టీ అగ్రనేతలు లేకుండానే జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పటికే రాహుల్​ విదేశీ పర్యటనలో ఉండగా.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరు కాలేదు. పార్టీ వ్యవహారాల్లో కీలక నేతగా ఉన్న ఏకే ఆంటోని పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రియాంకా గాంధీ సహా మరికొందరు అగ్రనేతలు పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరించిన ఆంటోని
వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన పార్టీ నేతలు

ఇదీ చూడండి: విదేశీ పర్యటనలో రాహుల్​ గాంధీ.. ఇటలీకే!

ABOUT THE AUTHOR

...view details