తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కుమారుడు.. తల్లి మాత్రం బడిలో స్వీపర్​గానే.. - ఎమ్మెల్యే లభ్ సింగ్ లేటెస్ట్ న్యూస్ ట

AAP MLA Mother: కన్నకొడుకు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాడు. ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఆయన తల్లి మాత్రం స్వీపర్​గానే పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చెత్త ఊడ్చుతూ జీవనం సాగిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

Son turned MLA The mother returned to school
ఎమ్మెల్యే లభ్ సింగ్

By

Published : Mar 13, 2022, 1:56 PM IST

Updated : Mar 13, 2022, 4:24 PM IST

సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కుమారుడు.. తల్లి మాత్రం బడిలో స్వీపర్​గానే..

AAP MLA Mother: కొడుకు ఎమ్మెల్యేగా గెలుపొందినా.. ఆమె మాత్రం స్వీపర్​ వృత్తినే కొనసాగిస్తున్నారు. పాఠశాల పరిసరాలు ఊడుస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అవును ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి చరణ్​​జీత్ సింగ్ చన్నీపై ఘన విజయం సాధించారు ఆమె కుమారుడు లభ్​ సింగ్ ఉగోకే. ఆమ్​ఆద్మీ పార్టీకి చెందిన లభ్​సింగ్​.. భదౌర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 37వేలకు పైగా మెజారిటీతో చన్నీని ఓడించారు.

స్కూల్లో స్వీపర్​గా కౌర్
పాఠశాలను ఊడుస్తున్న బల్దేవ్​ కౌర్

అయితే లభ్​​ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్​ మాత్రం.. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఏళ్ల తరబడి చేస్తున్న ఉద్యోగాన్నే కొనసాగిస్తున్నారు. తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను స్వీపర్​ పనినే చేస్తానని 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు కౌర్.

"లభ్ సింగ్ కచ్చితంగా పంజాబ్​లో మార్పులు తీసుకొస్తాడు. అతడు అందరికీ వైద్యం, విద్య అందిస్తాడు. నా కొడుకు ఎమ్మెల్యే అయినా క్లీనర్​ పనిని కొనసాగిస్తా. ఎన్నికలో గెలుస్తానని లభ్ సింగ్ మొదటినుంచి ధీమాగా ఉన్నాడు."

-- బల్దేవ్ కౌర్, ఎమ్మెల్యే లభ్​ సింగ్ తల్లి

ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా తన కుమారుడు పనిచేయాలని కోరుకుంటున్నానని లభ్ ​సింగ్ తండ్రి దర్శన్ సింగ్ అన్నారు. ఇక లభ్​ సింగ్ చిన్నప్పుడు ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారని.. మొన్నటివరకు మొబైల్ రిపేరింగ్ షాప్​లో పనిచేశారని పాఠశాల హెడ్ మాస్టర్ అమ్రిత్​ పాల్ కౌర్ తెలిపారు. మరోవైపు లభ్ సింగ్ విజయంతో ఆయన స్వగ్రామంలోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మేము ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నామని అంటున్నారు.

ఎమ్మెల్యే లభ్ సింగ్
ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్నకౌర్

లభ్​ సింగ్​ 2013లో ఆప్​లో చేరారు. నిరంతర కృషితో కొద్దికాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పంజాబ్​లో ఆప్ ఘన విజయం సాధించింది. 117 అసెంబ్లీ సీట్లకు గాను 92 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 18 సీట్లకే పరిమితమైంది.

ఇదీ చూడండి:సంక్షేమానికే యూపీ ప్రజల ఓటు.. పనిచేసిన మోదీ 'మేజిక్​'!

Last Updated : Mar 13, 2022, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details