ఉక్రెయిన్లో చిక్కుకున్న కుమారుడు.. దిగులుతో ఆగిన తల్లి గుండె Son stranded in Ukraine: తమిళనాడు తిరుపత్తూర్లోని పుత్తూర్లో హృదయ విదారక ఘటన జరిగింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న కుమారుడి కష్టాలు చూసి ఓ తల్లి గుండె ఆగింది. రష్యాతో యుద్ధం జరుగుతున్న ఆ దేశంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న బిడ్డ పరిస్థితి తలచుకుని దిగులుతో మరణించింది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న కుమారడు.. దిగులుతో ఆగిన తల్లి గుండె Tirupattur News
ఉక్రెయిన్లో చిక్కుకున్న కుమారడు.. దిగులుతో ఆగిన తల్లి గుండె మృతిచెందిన మహిళ పేరు శశికళ. ఆమె భర్త పేరు శంకర్. వీరి చిన్న కుమారుడు శక్తివేల్(25) ఉక్రెయిన్లోని ముజైల్ ప్రాంతంలో మెడిసిన్ చదువుతున్నాడు. కానీ రష్యా యుద్ధం ప్రకటించడం వల్ల అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో అక్కడున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడి పరిస్థితిపై శశికళ తీవ్ర కలత చెందింది. అప్పటికే బీపీ, మధుమేహంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి మరింత క్షీణించింది. శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కుటుంబసభ్యులు శశికళను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె తుదిశ్వాస విడిచింది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న కుమారడు.. దిగులుతో ఆగిన తల్లి గుండె Putture news
కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడుతున్న శక్తివేల్ తల్లి మరణవార్త తెలిసి శక్తివేల్ శోకసంద్రంలో మునిగిపోయాడు. వీడియోకాల్లో ఆమె బౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ పరిస్థితి చూసి గ్రామస్థులు కూడా చలించిపోయారు.
శక్తివేల్ సహా ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులందరినీ ప్రభుత్వం వీలైనంత త్వరగా స్వదేశం తీసుకురావాలని బంధువులు విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్లో చిక్కున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్రం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే ఐదు విమానాలు ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి దిల్లీ చేరుకున్నాయి. వీటి ద్వారా దాదాపు 1000కి మందికిపైగా స్వదేశం వచ్చారు.
ఇదీ చదవండి:ఉక్రెయిన్ పరిణామాలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం