తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లితో కలిసి ఐదేళ్లుగా తీర్థయాత్రలు.. తండ్రి ఇచ్చిన స్కూటర్​పైనే.. - తల్లితో కలిసి దక్షిణామూర్తి తీర్థయాత్ర

73 ఏళ్ల తల్లిని స్కూటర్​పై ఎక్కించుకుని భారత్​తో పాటు విదేశాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు ఓ వ్యక్తి. తల్లి కోరిక మేరకు 5 సంవత్సరాలుగా ఈ యాత్రను చేస్తున్నాడు. 13 ఏళ్లు పనిచేసి సంపాదించిన సొమ్మును ఇందుకోసం ఖర్చు చేస్తున్నాడు. ఆయనెవరో తెలుసా?

son-pilgrimage-on-scooter-with-mother-across-india
స్కూటర్‌పై తల్లితో కొడుకు తీర్థయాత్ర

By

Published : May 15, 2023, 3:17 PM IST

తల్లిని తన స్కూటర్​పై ఎక్కించుని దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తిప్పి చూపిస్తున్నాడు ఓ వ్యక్తి. దాంతో పాటు భారత్​కు సరిహద్దుగా ఉన్న విదేశాల్లోని పవిత్ర స్థలాలకు సైతం తీసుకెళుతున్నాడు. 20 ఏళ్ల క్రితం తన తండ్రి కొనిచ్చిన స్కూటర్​పైనే ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. తల్లి కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కుమారుడు.. గత 5 సంవత్సరాలుగా యాత్రను కొనసాగిస్తున్నాడు. అతడి పేరే డా. దక్షిణామూర్తి కృష్ణ కుమార్(42). కర్ణాటకకు చెందిన వ్యక్తి. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్ జిల్లా​లో ఉన్న బాబా గోరఖ్‌నాథ్ ఆలయాన్ని, ప్రసిద్ధ గోల్ఘర్ కాళీ మందిర్​ను.. తల్లితో కలిసి సందర్శించాడు దక్షిణామూర్తి.

స్కూటర్‌పై తల్లితో దక్షిణామూర్తి తీర్థయాత్ర

దక్షిణామూర్తి తల్లి పేరు.. చూడరత్నమ్మ(73). వీరు కర్ణాటకలోని మైసూర్‌లో ఉన్న వొగాడి ప్రాంతానికి చెందిన వారు. వీరిద్దరు కలిసి 2018 జనవరి 16న తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. దీనికి 'సంకల్ప్​ సేవ యాత్ర' అని పేరు పెట్టుకున్నారు. కర్ణాటకలో 13 ఏళ్లుగా ఓ ప్రముఖ సంస్థలో పనిచేసి సంపాదించిన సొమ్ముతో.. తల్లి కోరికను తీర్చుతున్నట్లు దక్షిణామూర్తి చెబుతున్నాడు. ఈ యాత్ర ద్వారా తనకు భారత్​లోని పవిత్ర స్థలాలను చూసే భాగ్యం కలిగిందని ఆయన చెబుతున్నాడు. అందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం తాను అయోధ్య వైపుగా వెళుతున్నట్లు దక్షిణామూర్తి వివరించాడు. దీనికి ముందు కేరళ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, గోవా, ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో పర్యటించినట్లు ఆయన పేర్కొన్నాడు.

తల్లితో దక్షిణామూర్తి

కుమారుడి అంకిత భావానికి ఎంతో గర్వంగా ఉందని చూడరత్నమ్మ తెలిపారు. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. దేశంలోని అన్ని పవిత్ర స్థలాలను చూపించి.. తన జన్మను కొడుకు ధన్యం చేశాడని చూడరత్నమ్మ వివరించారు. పొరుగు దేశాలైన నేపాల్, మయన్మార్, భూటాన్‌లలోని మతపరమైన ప్రదేశాలకు సైతం కొడుకు తనకు చూపించినట్లు చూడరత్నమ్మ పేర్కొన్నారు.

స్కూటర్​పై దక్షిణామూర్తి, చూడరత్నమ్మ

కలియుగ శ్రవణుడు అమ్మానాన్నలను భుజాలపై మోస్తూ వందల కిమీ యాత్ర..
కొద్ది రోజుల క్రితం ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి.. భుజంపై కావడి ఉంచుకుని ఓవైపు అమ్మ, మరోవైపు నాన్నతో.. వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. జీవిత చరమాంకంలో కావడి యాత్ర చేయాలన్న తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాడు. అతడి పేరు వికాస్​ గహ్లోత్.. గాయజియాబాద్​ జిల్లాకు చెందిన వ్యక్తి.

కావడి యాత్ర కష్టమైనా.. అమ్మానాన్నల కోర్కెను వికాస్ కాదనలేకపోయాడు. తానే అభినవ శ్రవణ కుమారుడి అవతారం ఎత్తాడు. ఇద్దరితో కలిసి గాజియాబాద్​ నుంచి హరిద్వార్ వెళ్లి గంగా స్నానం ఆచరించాడు. పవిత్ర జలం సేకరించి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని గాజియాబాద్​కు కావడి యాత్ర ప్రారంభించాడు. ఇందుకోసం లోహంతో ఓ బలమైన కావడి చేయించాడు. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details