ప్రియుడితో కలిసి అమ్రోహాలోని తన కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చిన యూపీ మహిళ షబ్నమ్‌ను ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో షబ్నమ్ కుమారుడు తన తల్లి చేసిన నేరాలను క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎదుట క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. రామ్‌పుర్ జైలులో తన తల్లిని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్న మహ్మద్ తాజ్.. భావోద్వేగానికి లోనయ్యాడు.
షబ్నమ్ కేసుకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ అనందిబెన్ పటేల్ క్షమాభిక్షను తిరస్కరించారు. అయితే శుక్రవారం మరోసారి గవర్నర్ ముందుకు వచ్చింది. ఈ సారి కూడా క్షమాభిక్ష తిరస్కరణకు గురైతే.. ఆమెను ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్ జల్లాదే షబ్నమ్‌నూ ఉరి తీసే అవకాశం ఉంది. ఉరి తీసే గదిని జల్లాద్ ఇప్పటికే రెండు సార్లు పరిశీలించారు.