తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో తల్లి మృతదేహం.. గుడిలో యువతితో వివాహం... అసలు ఏమైందంటే? - తల్లి ఆఖరి కోరికను తీర్చిన కుమారుడు

తల్లి శవాన్ని ఇంట్లో ఉంచుకుని పెళ్లి చేసుకున్నాడు ఓ కుమారుడు. తన తల్లి ఆఖరి కోరిక తీర్చడం కోసమే ఇలా చేశానని అంటున్నాడు. ఇంతకీ ఈ కథెంటో.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా..

Son married in temple by keeping mother dead body
తల్లి మృతదేహం వద్ద ఆశీస్సులు తీసుకుంటున్న కుమారుడు, కోడలు

By

Published : Jul 9, 2022, 1:38 PM IST

Updated : Jul 9, 2022, 3:11 PM IST

ఇంట్లో తల్లి మృతదేహం.. గుడిలో యువతితో వివాహం

తల్లి మృతదేహాన్ని ఇంట్లో ఉంచి కుమారుడు పెళ్లి చేసుకున్న ఘటన ఝూర్ఖండ్​లో జరిగింది. జూలై 10న కుమారుడి వివాహం జరగాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారమే మరణించింది. మృతురాలి చివరి కోరిక తన కుమారుడి పెళ్లి చేయడమే. ఈ నేపథ్యంలో తల్లి ఆఖరి కోరికను తీర్చేందుకు ఓం కుమార్ సిద్ధమయ్యాడు. శివాలయంలో సరోజ్​ను పెళ్లి చేసుకుని వచ్చి తల్లి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. ఈ ఘటన ధన్​బాద్​లోని కేందుఆడియా పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.

తల్లి మృతదేహం వద్ద ఆశీస్సులు తీసుకుంటున్న కుమారుడు, కోడలు

ఓం కుమార్​కు, సరోజ్​ అనే యువతితో కొన్ని రోజులు క్రితమే వివాహం కుదిరింది. వీరి పెళ్లి జూలై 10న చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఓం కుమార్ తల్లి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆరోగ్యం విషమించడం వల్ల గురువారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు ఓం కుమార్. మృతదేహాన్ని ఇంట్లో ఉంచి ఓం కుమార్​ సమీపంలోని శివాలయంలో సరోజ్​ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఓం కుమార్​ తన భార్య సరోజ్​తో కలిసి ఇంటికి వచ్చాడు. తల్లి కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాడు.

ఇవీ చదవండి:దూసుకెళ్లిన టమాటాల ట్రక్​.. ఇంటి బయట నిద్రిస్తున్న ఆరుగురు మృతి

Last Updated : Jul 9, 2022, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details