Son Killed Parents: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి.. తన తల్లిదండ్రులనే కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో వెలుగుచూసింది. ఆదివారం ఉదయం సుమారు పది గంటల సమయంలో తల్లిదండ్రులు రోడ్డు సమీపంలో పనిచేసుకుంటూ ఉండగా వచ్చిన నిందితుడు.. కత్తితో నరికి చంపేశాడు. అనంతరం తాను హత్య చేసినట్లు పోలీసులు సమాచారం అందించి అక్కడి నుంచి పరారయ్యాడు.
నడిరోడ్డుపైనే తల్లిదండ్రులను నరికేసిన కుమారుడు.. ఎందుకంటే? - కేరళ త్రిస్సూర్ వార్తలు
Son Killed Parents: కేరళలోని త్రిస్సూర్‌లో దారుణం జరిగింది. తల్లిదండ్రులను నడిరోడ్డు మీదే కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Son Killed Parents
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అనీశ్ (30) సహా మృతులు కుట్టన్ (60), చంద్రిక (55) ఇన్చాకుండ్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :యూపీలో ఘోరం.. ఏడేళ్ల బాలికపై హిజ్రా అత్యాచారం
Last Updated : Apr 10, 2022, 8:15 PM IST