తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.900 కోసం కన్నతండ్రినేే కడతేర్చిన కుమారుడు - తండిని హత్య చేసిన కొడుకు

son killed father: రూ.900 అడిగితే ఇవ్వలేదన్న ఆగ్రహంతో కన్నతండ్రినే చిదకబాది హతమార్చాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది.

son killed father
తండ్రిని హతమార్చిన కొడుకు

By

Published : Feb 7, 2022, 11:50 AM IST

son killed father: వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రినే కడతేర్చాడు ఓ కిరాతక కుమారుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా జవహర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

పాల్ఘర్ జిల్లా జవహర్ ప్రాంతానికి చెందిన జాను మాలి.. పించన్ డబ్బులు రూ. 900 తన బ్యాంక్ ఖాతాలో నుంచి తీశారు. ఆ డబ్బులను కుమారుడు రవీంద్ర మాలి అడగగా ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన రవీంద్ర మాలి(35) తన తండ్రిని చితకబాదాడు. బాధితుడిని వెంటనే కుటుంబసభ్యులు మొఖాడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిస్థితి చేజారిపోయిందని, నాసిక్​కు తీసుకెళ్లాలని సూచించారు. నిందితుడు రవీంద్ర మాలి తన తండ్రిని నాసిక్​కు తరలించకుండా ఇంటికి తీసుకెళ్లిపోయాడు. మరుసటి రోజే జాను మాలి చనిపోయాడు.

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడు రవీంద్ర మాలిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.

ఇదీ చదవండి:17 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. గర్భవతి కావడంతో..

ABOUT THE AUTHOR

...view details