Paralysed Son killed by father: పక్షవాతంతో బాధపడుతున్న కుమారుడి ఆలనాపాలనా చూసుకోవాల్సిన తండ్రే.. కడతేర్చాడు. మద్యం మత్తులో ఇంటికెళ్లి నిస్సహాయ స్థితిలో ఉన్న కొడుకును చితకబాది.. హతమార్చాడు. ఈ విషాద ఘటన దిల్లీలోని భరత్ నగర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం..
మృతుడి పేరు పరమ్జీత్. అతను 14 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఎటూ కదల్లేని పరిస్థితుల్లో మంచాన పడ్డాడు. పరమ్జీత్ వ్యక్తిగత పనులు కుటుంబ సభ్యులే చూసేవారు. అయితే ఆదివారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన అతడి తండ్రి అజ్మీర్ సింగ్.. కొడుకుపై కర్రతో దాడి చేశాడు.