బంగాల్లోని జల్పాయ్గుడీలో హృదయవిదారక ఘటన జరిగింది. మహిళ మృతదేహాన్ని ఆమె భర్త, కొడుకు భుజంపై మోసుకెళ్లడం కలకలం రేపింది. అంబులెన్స్ డ్రైవర్ అడిగిన రూ.3 వేలు ఇవ్వలేక వారు ఇలా చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ఇదీ జరిగింది..
జల్పాయ్గుడీలోని క్రాంతి బ్లాక్‌కు చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి రోజువారి కూలీ. అతడి తల్లి లక్ష్మీరాణి శ్వాశకోశ వ్యాధులతో బాధపడేది. దీంతో రాంప్రసాద్ ఆమెను జలపాయ్గుడీలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. తల్లి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌ను బేరమాడాడు రాంప్రసాద్. అంబులైన్స్ డ్రైవర్ రూ.3 వేలు ఇస్తే మృతదేహాన్ని ఇంటి దగ్గర దింపుతామని చెప్పాడు. అన్ని డబ్బులు రాంప్రసాద్ దగ్గర లేక తల్లి మృతదేహాన్ని తండ్రితో కలిసి భుజంపై మోసుకెళ్లాడు. ఇంతలో వీరిని 'గ్రీన్ జల్పాయ్గుడీ' అనే స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అంకుర్ దాస్ వీరిని గమనించారు. వెంటనే ఆ సంస్థకు చెందిన అంబులెన్స్‌ను తెప్పించి అందులో మహిళ మృతదేహాన్ని తరలించారు.
అంబులెన్స్‌కు డబ్బులు లేక అవస్థలు.. తల్లి మృతదేహాన్ని తండ్రితో కలిసి భుజంపై మోస్తూ..
బంగాల్లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు డబ్బులు లేక ఓ కుమారుడు తన తండ్రితో కలిసి భుజంపై మోసుకెళ్లాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
Etv Bharat
'గ్రీన్ జల్పాయ్గుడీ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అంకుర్ దాస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మృతురాలి కుటుంబీకులు అంబులెన్స్ కావాలని వచ్చారు. వారు మేము అడిగిన డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు లేవని చెబితే ఉచితంగా మృతదేహాన్ని వారింటికి తరలించేవాళ్లం. చాలా మంది పేదల మృతదేహాలను ఉచితంగా అంబులెన్సుల్లో దింపాం. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్ర ఇది.'
-- దిలీప్ దాస్, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్స్ అసోసియేషన్ సెక్రటరీ