తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువకుడి పొట్టలో 21 మేకులు- అవాక్కయిన వైద్యులు! - మేకులు తిన్న యువకుడు

తండ్రి మందలించాడనే కోపంతో ఓ యువకుడు ఇనుప మేకులు మింగేశాడు. కడుపులో నొప్పి రావడం వల్ల ఆస్పత్రిలో చేర్చించగా.. రెండున్నర గంటలు శ్రమించి.. ఆ మేకులను బయటకు తీశారు వైద్యులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో జరిగింది.

son ate iron Nails after father scolding
కోపంతో మేకులు మింగిన యువకుడు

By

Published : Dec 6, 2021, 10:57 PM IST

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ఓ వింత సంఘటన వెలుగుచూసింది. తండ్రి మందలించాడని 17 ఏళ్ల యువకుడు 21 ఇనుప మేకులు మింగేశాడు.

యువకుడు కోపంతో మింగిన మేకులు

ఏమైందంటే?

నగరానికి చెందిన ధనుంజయ అనే యువకుడిని 21 రోజుల క్రితం ఓ విషయమై తండ్రి మందలించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ధనుంజయ.. 21 ఇనుప మేకులు మింగేశాడు. అప్పటి నుంచి కడుపు నొప్పి మొదలైంది. ఆ నొప్పి రోజురోజుకూ ఎక్కువవుతూ వచ్చింది. నొప్పి తీవ్రతరం కావడం వల్ల ధనుంజయ్​ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు అతని తండ్రి.

ధనుంజయ్​కు సాధారణ పరీక్షలు చేసిన వైద్యులకు పరిస్థితి అర్థం కాలేదు. దీంతో ఆస్ట్రాసౌండ్​ స్కానింగ్​ తీశారు. కడుపులో మేకులు ఉండటం చూసి.. వైద్యులు అవాక్కయ్యారు. రెండున్నర గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స ద్వారా 21 మేకులను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి:Omicron in India: దేశంలో 24కు చేరిన ఒమిక్రాన్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details