కరోనా ఆపత్కాలంలో వైద్య సిబ్బంది సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ, కర్ణాటక బళ్లారి జిల్లాలో ఓ వ్యక్తి మాత్రం.. వారిపైనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు.
ఏం జరిగిందంటే..
కరోనా ఆపత్కాలంలో వైద్య సిబ్బంది సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ, కర్ణాటక బళ్లారి జిల్లాలో ఓ వ్యక్తి మాత్రం.. వారిపైనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు.
ఏం జరిగిందంటే..
బళ్లారి తాలుకాలోని సంగనగల్లు గ్రామానికి చెందిన మల్లికార్జున గౌడ అనే వ్యక్తికి ఇటీవల కరోనా సోకగా.. చికిత్స కోసం బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. మల్లికార్జున గౌడ మరణవార్త తెలుసుకున్న ఆయన కుమారుడు తిప్పెస్వామి ఆగ్రహానికి లోనయ్యాడు. కొవిడ్ చికిత్స కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్య విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు. ఆకస్మాత్తుగా ఆమె చెంపపై కొట్టాడు. అనంతరం.. ఆమెను నెట్టేశాడు.
ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీనిపై కౌల్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చూడండి:కరోనా మారణహోమం- 3లక్షలు దాటిన మృతులు