తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంచానికే పరిమితమైన తల్లి.. తాజ్​ మహల్​ చూడాలని కోరిక.. కొడుకు ఏం చేశాడంటే? - తల్లి కోరిక తీర్చిన కొడుకు

మంచానికే పరిమితమైన 85 ఏళ్ల వృద్ధురాలి కోరికను తీర్చారు కొడుకు, కోడలు. తాజ్​ మహల్ చూడాలనే ఆమె కోరికను నెరవేర్చారు. ముగ్గురు కలిసి ఆగ్రా వెళ్లి.. తాజ్​ మహల్​ను సందర్శించారు.

son-and-daughter-in-law-fulfilled-mother-wish-to-see-taj-mahal
Etv Bharatతాజ్​ మహల్ చూడాలనే తల్లి కోరిక తీర్చిన కొడుకు

By

Published : Mar 21, 2023, 11:05 AM IST

నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన.. ఓ 85 ఏళ్ల వృద్ధురాలి కోరికను తీర్చారు ఆమె కొడుకు, కోడలు. తాజ్​ మహల్​ చూడాలనే వృద్ధురాలి చిరకాల వాంఛను నెరవేర్చారు. స్ట్రెచర్​పై ఆమెను తీసుకువచ్చి తాజ్​మహల్​ మొత్తాన్ని తిప్పి చూపించారు. గుజరాత్​కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి.. తన భార్యతో కలిసి, తల్లి రజియా కోరికను ఈ విధంగా నెరవేర్చాడు. సోమవారం వీరంతా కలిసి ఆగ్రాను సందర్శించారు.

మహమ్మద్ ఇబ్రహీం కుటుంబం గుజరాచ్ కచ్ జిల్లాలోని ముంద్రా ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇబ్రహీం తల్లి రజియా.. 32 సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయింది. చాలా ఏళ్లుగా రజియాకు తాజ్​మహల్​ చూడాలనే కోరిక ఉంది. ఆ కోరికను కొడుకుకు తెలియజేసింది. దీంతో తల్లి కోరికను ఎలగైనా తీర్చాలని ఇబ్రహీం నిర్ణయించుకున్నాడు. తల్లిని స్ట్రెచర్​పై పడుకోబెట్టి.. భార్యతో కలిసి ఆగ్రాను సందర్శించాడు.

"మా పూర్వీకుల్లో ఒకరు అప్పట్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసేవారు. ఆయనకు అప్పటి పరిపాలకుడైన జహంగీర్​ మరణ శిక్షను విధించాడు. ఆయన సమాధి కూడా ఆగ్రాలోనే ఉంది. ముందుగా మేమంతా కలిసి ఆయన సమాధి వద్దకు వెళ్లాం. అనంతరం ఆయన సమాధికి నివాళులు అర్పించాం. ఆ తర్వాత తాజ్​మహల్​ చూసేందుకు బయలుదేరాం" అని మహమ్మద్ ఇబ్రహీం తెలిపారు.​ ఇప్పుడు తన తల్లి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఇబ్రహీం తెలిపారు. తన తల్లి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు.

తాజ్​ మహల్ చూడాలనే తల్లి కోరిక నెరవేర్చిన కొడుకు
తాజ్​ మహల్ చూడాలనే తల్లి కోరిక నెరవేర్చిన కొడుకు

ఇబ్రహీంకు ప్రశంసలు..
మహమ్మద్ ఇబ్రహీం చేసిన ఈ మంచి పనికి పలువురి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. స్ట్రెచర్​పై తల్లిని తీసుకుని తాజ్​ మహల్​కు వచ్చిన ఇబ్రహీంను చూసి.. మిగతా సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అతడిని అభినందించారు. స్ట్రెచర్​పై తల్లిని తీసుకుని వచ్చి తాజ్​మహల్​ చూపిస్తున్న.. ఇబ్రహీం వీడియో, సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​గా మారింది. సోషల్​ మీడియా వేదికగా కూడా ఇబ్రహీంను చాలా మంది అభినందిస్తున్నారు.

56 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరిన మహిళ.. కన్నతల్లి కోరిక నెరవేర్చిన తనయుడు..
ఇటీవల ఇదే తరహా ఘటన ఒకటి జరిగింది. ఓ వృద్ధురాలి కోరికను నెరవేర్చాడు కొడుకు. 56 ఏళ్ల తర్వాత ఆమెను.. తన పుట్టింటికి చేర్చాడు. కొన్నేళ్ల తల్లి నిరీక్షణకు తెరదించాడు. తన పుట్టింటి వారిని చూసిన ఆ వృద్ధురాలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమెను చూసిన పుట్టింటి వారు ఎలా స్వాగతించారు, తరవాత ఏవిధంగా వారు స్పందించారో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details