తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2021, 7:53 PM IST

ETV Bharat / bharat

సోనూపై​ అభిమానం- 10 అడుగుల పెయింటింగ్​

నటుడు సోనూసూద్​పై అభిమానంతో ఓ వ్యక్తి సోనూ బొమ్మను 10 అడుగుల గోడపై గీశాడు. ఈ పెయింటింగ్​కు ఫిదా అయిన సోనూ.. సదరు అభిమానిని తప్పక కలుస్తానని మాటిచ్చారు.

sonusood painting on wall
సోనూసూద్​ పెయింటింగ్​

10 అడుగుల గోడపై సోనూసూద్​ పెయింట్​ వేసిన అభిమాని

కరోనా కాలంలో ఆపదలో ఉన్నవారికి 'నేనున్నాను' అంటూ సాయం చేస్తూ ఎన్నోసార్లు గొప్ప మనసు చాటుకున్నారు నటుడు సోనూసూద్​. తెరపై విలన్​గా మెప్పించినప్పటికీ.. ప్రజలు ఆయనను 'రియల్​ హీరో' అని పిలుచుకుంటున్నారు. అలాంటి సోనూసూద్​పై తనకు ఉన్న అభిమానాన్ని మధ్యప్రదేశ్​ జబల్​పుర్​కు చెందిన ఓ వ్యక్తి విభిన్నంగా చాటుకున్నాడు. సోనూ బొమ్మను 10 అడుగుల గోడపై పెయింట్ చేశాడు.

సోనూసూద్​ పెయింటింగ్​ వేస్తున్న సోమిన్​

సరాఫా ప్రాంతంలో నివసించే సోమిన్​ అనే యువకుడు ఈ పెయింటింగ్​ను వేశాడు. 8 రోజులపాటు శ్రమించి అతడు దీన్ని పూర్తి చేశాడు. అనంతరం మే 22న దాన్ని అతడు ట్విట్టర్​లో సోనూసూద్​కు ట్యాగ్​ చేస్తూ షేర్​ చేశాడు. ఆ ట్వీట్​ను చూసి సోనూసూద్​ హర్షం వ్యక్తం చేశారు. జబల్​పుర్​కు విచ్చేసి తాను సోమిన్​ను కలుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు సోనూ రాక కోసం సోమిన్​ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను కూడా గోడపై పెయింట్​ చేశాడు సోమిన్​.

ABOUT THE AUTHOR

...view details