తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాక్టర్​ ఎక్కి పొలం దున్నిన 'సుప్రీం' ప్లీడర్​!

సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్​ జనరల్ కేఎమ్​ నటరాజ్​..​ వ్యవసాయం చేస్తున్నారు. అంతపెద్ద హోదాలో ఉండి కూడా ఓ సాధారణ రైతులా పంచె కట్టుకుని పొలాన్ని దున్నుతున్నారు. యువత సాగురంగాన్ని ప్రోత్సహించాలని సందేశం ఇస్తున్నారు.

Supreme court solicitor general KM Nataraj working as farmer
పొలం పనుల్లో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్​ జనరల్

By

Published : Jun 12, 2021, 2:18 PM IST

పొలం పనుల్లో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్​ జనరల్

ఖాళీ సమయంలో ఎవరైనా ఎలా గడుపుతారు? సాధారణంగా అయితే పుస్తకాలు చదవటం, గరిట తిప్పడం వంటి పనులు చేస్తుంటారు. కానీ సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్​ జనరల్​ కేఎమ్​ నటరాజ్​.. వ్యవసాయం చేస్తున్నారు. ట్రాక్టర్​ ఎక్కి పొలం దున్నుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. వ్యవసాయాన్ని మాత్రం వదిలేయకూడదని తన చర్యలతో చాటిచెబుతున్నారు. ముఖ్యంగా యువత సాగు రంగంలోకి అడుగుపెట్టాలని సందేశాన్నిస్తున్నారు.

పొలం పనుల్లో నటరాజ్​

'నా రక్తమే అది..'

నటరాజ్​.. కర్ణాటక, దక్షిణ కన్నడ జిల్లాలోని ఈశ్వర మంగళమ్​ ప్రాంతానికి చెందినవారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. తల్లితండ్రులు సాగుపైనే ఆధారపడి జీవించారు. చాలాకాలంగా వారు వరిసాగు చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ ఆయనకు వ్యవసాయమంటే ఎనలేని ప్రేమ, ఆసక్తి. ప్రస్తుతం కరోనా లాక్​డౌన్​ కారణంగా ఆయన కూడా కుటంబంతో పాటు సరదాగా సాగులో పాలుపంచుకుంటున్నారు. 'వ్యవసాయం నా రక్తంలోనే' ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

పొలం దున్నుతున్న సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్​ జనరల్

నటరాజన్​ పని చేస్తుండగా.. ఆయన కుటంబసభ్యులు తీసిన వీడియోపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ట్రాక్టర్​ నడుపుతున్న కేఎమ్ నటరాజ్

ఇవీ చదవండి:భారత టాప్​-20 బిలియనీర్లు వీరే

అంబులెన్స్ డ్రైవరే టీకాలు వేస్తే!

ABOUT THE AUTHOR

...view details