జమ్ముకశ్మీర్ లో మంచులో చిక్కుకున్న సంచార బకర్వాల్ (గొర్రెల కాపరులు) కుటుంబానికి ఆహారం అందించేందుకు 24 గంటలపాటు ట్రెక్కింగ్ చేశారు ఆర్మీ సిబ్బంది. 11వేల మీటర్ల ఎత్తులో ఉన్న నాగిన్ సుర్ శిఖరంలో బషీర్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలు, జంతువుల మందతో కతువా నుంచి మర్వా లోయకు వెళ్తున్నారు. పచ్చిక బయళ్ల కోసం యాటా రెండు సార్లు ఇలా వలస వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వారు మంచులో చిక్కుకున్నారు.
ఆ కుటుంబం కోసం.. 24 గంటలపాటు సైనికుల ట్రెక్కింగ్ - నాగిన్ సుర్ శిఖరం
జమ్ముకశ్మీర్ లో మంచులో చిక్కుకొన్న ఓ బకర్వాల్ కుటుంబానికి 24 గంటలపాటు ట్రెక్కింగ్ చేసి ఆహారాన్ని అందించింది సైన్యం. తక్షణ సాయం అందించడానికి ప్రతికూల వాతావరణంలో ప్రయాణించారు సైనికులు
24 గంటలపాటు సైనికుల ట్రెక్కింగ్
ఈ క్రమంలో సహాయం కోసం ఆర్మీకి చెందిన ఛత్రూ సబ్ డివిజన్ కు ఫోన్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు వారి కోసం ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువులను అందించారు. అందుకోసం ప్రతికూల వాతావరణంలో 24 గంటలపాటు కఠిన ప్రయాణం చేశారు. తక్షణ సాయం అందించిన సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేసింది అహ్మద్ కుటుంబం.
ఇదీ చూడండి:లాక్డౌన్తో 'ఉపాధి' పనులకు ఆదరణ