పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో నౌషెరా సెక్టార్ వద్ద మోర్టార్ షెల్స్‌ని ప్రయోగించింది. ఈ ఘటనలో ఓ జవాన్ అమరుడైనట్లు అధికారులు తెలిపారు. పాక్ చర్యకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని పేర్కొన్నారు.
పాక్ దుర్నీతికి మరో భారత జవాన్ బలి - Ceasefire violation in Jammu Kashmir
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్ షెల్స్‌తో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఓ భారత జవాన్ మృతి చెందాడు.
పాక్ దుర్నీతికి మరో భారత జవాన్ బలి
నౌషెరా సెక్టార్ వద్ద శుక్రవారం సాయంత్రం 3:30 గంటల సమయంలో ఓసారి, 5.30కు మరోసారి పాక్ బలగాలు దాడులకు పాల్పడ్డాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:పాక్‌లో గుడి కూల్చివేతపై భారత్ నిరసన