జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జిల్లాలో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడిలో ఓ సైనికుడు అమరుడయ్యాడు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయని భారత సైన్యం అధికారి ఒకరు వెల్లడించారు.
ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి- జవాను మృతి
భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన గ్రెనేడ్ దాడిలో ఓ సైనికుడు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఈ దాడి జరిగింది.
ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి: ఓ జవాను మృతి
భద్రతా దళాలే లక్ష్యంగా అనంత్‌నాగ్ జిల్లాలోని షాంసిపొర ప్రాంతంలో ముష్కరులు ఈ గ్రెనేడ్ దాడికి పాల్పడినట్లు ఆ అధికారి తెలిపారు. గాయపడిన జవాన్లను 92 బేస్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దిల్లీ ఘటనలో తికాయత్‌పై కేసు