సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్మకు పాల్పడ్డ ఘటన కర్ణాటకలో జరిగింది. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడు.. తన సొంత కారులోనే ప్రాణాలు తీసుకున్నాడు. బెంగళూరులో ఈ విషాదకర ఘటన జరిగింది. కాగా మృతుడిని విజయ్ కుమార్(51)గా గుర్తించారు. అతడు నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
కారులో టెకీ ఆత్మహత్మ.. ముఖానికి ప్లాస్టిక్ కవర్.. నోట్లో నైట్రోజన్ పైపు.. - Software engineer suicide due to heart problems
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్మకు పాల్పడ్డాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. తన సొంత కారులోనే ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కుమార్ (51)కు కొద్ది రోజుల క్రితం గుండె సంబంధించిన సమస్య ఉందని తెలిసింది. దీనిపై విజయ్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తాను చాలా రోజులు బతకనని కుటుంబ సభ్యులకు చెబుతూ.. బాధ పడేవాడు. బుధవారం కారు వాష్ కోసమని చెప్పి.. బయటకు వెళ్లాడు విజయ్ కుమార్. మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబరహళ్లి జంక్షన్ రోడ్డు పక్కన కారు ఆపాడు. అనంతరం అటుగా వెళుతున్న వ్యక్తికి కొంత డబ్బును ఇచ్చి.. తాను కారులో కూర్చున్న తరువాత వాహనానికి కవర్ కప్పమని చెప్పాడు. అనంతరం ఓ ప్లాస్టిక్ కవర్ను మొహానికి చుట్టుకొని, నోట్లో నైట్రోజన్ పైపు పెట్టుకొని చనిపోవడానికి ప్రయత్నించాడు.
రోడ్డు పక్కనే కవర్తో కప్పి ఉంచిన కారు గమనించిన స్థానికులు.. సమాచారాన్ని పోలీసులుకు అందజేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం కారును పరిశీలించగా.. కారు వెనుక సీట్లో విజయ్ కుమార్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. అప్పటికే విజయ్ కుమార్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధరించారు. అనంతరం ఘటనపై మృతుడి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఘటనపై కేసు చేసుకున్నామని, విచారణ సైతం చేస్తున్నామని వారు తెలిపారు.