సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ యువతిపై పది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. యువతి పరిస్థితి విషమించగా నిందితులంతా.. అక్కడనుంచి పరారయ్యారు. బాధితురాలు తల్లిదండ్రులకు జరిగిందంతా వెల్లడించింది. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌లోని ఛాయిభాసా జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నివసిస్తోంది. ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఆమె.. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. బాధితురాలు.. అక్టోబర్ 20న సాయంత్రం 5 గంటల సమయంలో తన స్నేహితుడితో కలిసి విమానాశ్రయానికి స్కూటీపై వెళ్లింది. అక్కడ కాసేపు ఇద్దరు కలిసి ముచ్చటిస్తుండగా చీకటి పడింది. ఆ సమయంలో ఓ 10 మంది యువకులు వచ్చి వారిద్దరిని చితకబాదారు. యువతితో పాటు అతని స్నేహితుడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌తో పాటు ఐదు వేల రూపాయల నగదు లాక్కున్నారు. నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్నాక.. నిందితులు ఆమెను అక్కడే వదిలి పరారయ్యారు.
స్ఫృహలోకి వచ్చాక ఇంటికి చేరుకున్న యువతి.. తల్లిద్రండ్రులకు అసలు విషయం తెలిపింది. వెంటనే వారందరూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆ పది మంది నిందితులపై ఫిర్యాదు చేశారు. యువతి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణను ప్రారంభించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన 2016 ఘటన...
2016లో ఓ యువతి పై జరిగిన అత్యాచారంపై తాజాగా కేసు నమోదయ్యింది. పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలో జరిగింది.