రాజస్థాన్‌లో ఓ జంట వివాహం చేసుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో విశేషం ఏమిటంటే.. వధూవరులిద్దరూ మరుగుజ్జులు. ఈడూ జోడున్న ఈ జంటను చూసిన వారంతా వారికి అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఈ జంట.. అనంతరం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది.
ఈ మరుగుజ్జుల పెళ్లి అదుర్స్..! వివాహ వీడియో సోషల్ మీడియాలో వైరల్.. - రాజస్థాన్ లేటెస్ట్ న్యూస్
ఓ జంట వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వధూవరులిద్దరూ మరుగుజ్జులు. ఈడు జోడున్న ఈ జంటను చూసిన వారంతా విషెస్ చెబుతున్నారు.
జోధ్‌పుర్‌కు చెందిన సాక్షి అనే యువతికి రాజ్ సమంద్కు చెందిన రిషబ్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించి ఏడాది క్రితమే వాళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిపించారు. గురువారం వారి వివాహం ఘనంగా జరిగింది. సాక్షి, రిషబ్ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో 'మినీ కపుల్' అనే ఐడీని క్రియేట్ చేసి వారి పెళ్లికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జంటను చూసినవారంతా వారిద్దరికీ విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ జంట యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ జీవితంలో జరిగే విషయాలను పంచుకుంటున్నారు. రిషబ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2,000 పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎంబీఏ చదివిన సాక్షి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పాఠాలు భోదిస్తుంది. రిషబ్ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
ఇంతకుముందు కూడా ఇలాంటి ఓ వివాహం నెట్టింట వైరల్‌గా మారింది. పొట్టిగా ఉన్నందున తనకు పెళ్లి కావట్లేదని మరుగుజ్జు యువకుడు అజీమ్ మసూరి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. యువతి దొరికినా కూడా 2019 నుంచి ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి చేయట్లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఎట్టకేలకు పోలీసుల సహాయంతో పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.