ఉత్తర్ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 55కు చేరినట్లు తెలుస్తోంది. మరో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారంతా జేఎన్ వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం ఈ మృతుల సంఖ్యను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ ఘటనలో 25 మందే మృతి చెందారని జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర భూషణ్ సింగ్ శనివారం నిర్ధరించారు. అయితే.. అలీగఢ్ ఎంపీ చెప్పిన మృతుల సంఖ్యకు, డీఎం చెప్పిన లెక్కలకు పొంతన లేదు. కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్యను అధికారులు దాస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం రాత్రి మరో 48 మృతదేహాలను పోస్టుమార్టం కోసం అధికారులు తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉన్నట్లు తెలుస్తోంది.