పంజాబ్ మోగాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు.
సిద్ధూ ప్రమాణ స్వీకారానికి వెళ్తుంటే ప్రమాదం- ఐదుగురు మృతి - siddu as punjab pcc chief ceremony accident
09:57 July 23
రెండు బస్సులు ఢీ - ఐదుగురు మృతి
ఇందులో ఒక బస్సు.. పంజాబ్ రోడ్డు రవాణా సంస్థకు చెందినది కాగా.. మరో బస్సు ప్రైవేట్ వాహనం అని మోగా ఎస్ఎస్పీ హరంబీర్ సింగ్ తెలిపారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రైవేట్ బస్సులో ఉన్న వారంతా.. నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్గా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి వెళ్తున్నారని పేర్కొన్నారు.
సీఎం విచారం..
మోగా ప్రమాద ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి తక్షణమే పూర్తి వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపాలని సూచించారు.