జవహర్ టన్నెల్ ప్రాంతంలో భారీ హిమపాతం, బనిహాల్, ఛందేర్కోటె ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. ఫలితంగా దాదాపు 300 వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసాయని అధికారులు స్పష్టం చేశారు.
సోమవారం రాత్రి నుంచే వందల సంఖ్యలో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయని, సహాయక చర్యలు చేపట్టి రంబన్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ పరూల్ భరద్వాజ్ పేర్కొన్నారు.