అక్రమంగా పాముల విషాన్ని అమ్ముతున్న ఐదుగురిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది.
పాముల విషం కోసం భారీ డీల్- ఐదుగురు అరెస్టు - పాముల విషం అమ్ముతూ ఐదుగురు అరెస్టు
పాముల విషాన్ని అక్రమంగా అమ్ముకుంటున్న ముఠా గుట్టురట్టు చేశారు ఒడిశా భువనేశ్వర్‌లోని అటవీ శాఖ అధికారులు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పాముల విషం అమ్ముతున్న ఐదుగురు అరెస్టు
రూ. 10 లక్షలకు పాముల విషాన్ని అమ్మేందుకు డీల్ కుదుర్చుకున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అలోక్ కుమార్ మిశ్రా తెలిపారు. శనివారం నిందితుల వద్ద నుంచి 1.3 లీటర్ల విషాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:యూపీ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం