తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్లో అర్ధరాత్రి పాము హల్​చల్.. బెంబేలెత్తిన ప్రయాణికులు.. ట్రైన్​ను నిలిపివేసినా.. - నిజాముద్దీన్ ఎక్స్​ప్రెస్

Snake In Train: కేరళ కోజికోడ్ రైల్వే స్టేషన్​లో పాము కలకలం సృష్టించింది. తిరువనంతపురం- నిజాముద్దీన్ ఎక్స్​ప్రెస్​లో బుధవారం రాత్రి పాము కనిపించింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. సమాచారం అందుకున్న టీటీఈ.. పాముల పట్టేవారితో వెతికించినా అది కనిపించలేదు. కాసేపటి తర్వాత రైలు బయల్దేరింది.

Snake spotted in train
రైలులో పాము హల్​చల్

By

Published : Jul 29, 2022, 7:35 AM IST

Updated : Jul 29, 2022, 10:41 AM IST

రైలులో పాము హల్​చల్

Snake In Train: తిరువనంతపురం-నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బుధవారం రాత్రి పాము కనిపించడం వల్ల ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దాన్ని వెతికి పట్టుకునేందుకు అధికారులు గంటకుపైగా రైలును నిలిపివేశారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌ స్టేషన్‌లో జరిగింది. తిరూర్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరిన కాసేపటికి ఎస్‌5 బోగీలో బెర్తు కింద లగేజీ మధ్యలో పామును గుర్తించిన ప్రయాణికులు టీటీఈకి తెలియజేశారు. ఆయన అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును తదుపరి స్టేషన్‌ అయిన కోజికోడ్‌లో నిలిపివేశారు.

బోగీలోని ప్రయాణికులందరినీ దింపి పాములు పట్టేవారితో వెతికించారు. కానీ దాని జాడ కనిపించలేదు. ప్రయాణికులు ఫోన్లలో తీసిన ఫొటోలను పరిశీలించిన తర్వాత అది విషపూరితం కాని సర్పమన్న నిర్ధరణకు వచ్చారు. రైలు నుంచి అది వెళ్లిపోయి ఉంటుందని, లేదా బోగీ పక్కన ఉన్న ఓ రంధ్రంలోకి వెళ్లి ఉండొచ్చని భావించారు. ఆ రంధ్రాన్ని మూసివేశాక రైలు బయల్దేరింది.

Last Updated : Jul 29, 2022, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details