తమిళనాడు కాంచీపురంలో ఓ వింత ఘటన కలకలం రేపింది. కోడి గుడ్డులో పాముపిల్ల బయటపడటం చూసి జనం అవాక్కయ్యారు.
ఆమ్లెట్ వేద్దామనుకుంటే కోడిగుడ్డులో పాము పిల్ల..! - కాంచిపురంలో కోడిగుడ్డులో పాము పిల్ల
ఓ కోడి గుడ్డులో పాము పిల్ల బయటపడటం ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో జరిగింది.
కోడిగుడ్డులో పాముపిల్ల..ఆమ్లేట్కు బదులు ఆందోళన
కాంచీపురంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తోన్న మేఘనాథన్ మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాడు. అతని భార్య ఆమ్లేట్ వేద్దామని గుడ్డు పగులగొట్టింది. కానీ అందులో ఓ పాము పిల్ల కనిపించడం వల్ల భయపడి భర్త, చుట్టుపక్కలవారిని పిలిచింది. వారు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి:తమిళనాట జల్లికట్టు జోరు- బసవన్నల హోరు