ఓ యువకుడ్ని 10 రోజుల్లో 5 సార్లు విష సర్పం కాటేయడం.. ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రా జిల్లాలో చర్చనీయాంశమైంది. మల్పురా ప్రాంతంలోని మన్‌కేఢా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రజత్ చాహర్.. ఐదు సార్లు ప్రాణాలతో బయయపడ్డాడు. అసలు ఆ పాము తనను ఎందుకు వెంటాడుతోందో, ప్రతిసారీ ఎడమ కాలిపైనే కాటేయడానికి కారణమేంటో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
సెప్టెంబర్ 6న మొదలు..
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మన్‌కేఢా గ్రామానికి చెందిన రామ్ కుమార్ చాహర్ తనయుడైన రజత్ చాహర్.. డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6న రాత్రి 9 గంటలకు ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ పాము అతడి ఎడమ కాలిపై కాటేసింది. భయంతో రజత్ గట్టిగా అరిచాడు. ఇంట్లోని వాళ్లు వచ్చేసరికి పాము వెళ్లిపోయింది. హుటాహుటిన అతడ్ని నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత కాసేపటికి ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. 4 గంటలపాటు అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేక్షించారు. పాము కాటు లక్షణాలేవీ కనిపించడం లేదని రజత్‌ను ఇంటికి పంపేశారు.
సెప్టెంబర్ 8న సాయంత్రం ఇంటి బయట ఉన్న బాత్రూమ్కు వెళ్లాడు రజత్. అప్పుడు అతడి ఎడమ కాలిపై మరోసారు పాము కాటేసింది. రజత్‌ను హుటాహుటిన ముబారక్‌పుర్ తీసుకెళ్లి, నాటు వైద్యుల దగ్గర చికిత్స చేయించారు. అయినా ఆ పాము అతడ్ని విడిచి పెట్టలేదు. ఈనెల 11న ఇంట్లోని ఓ గదిలో ఉండగా; ఈనెల 13న బాత్రూమ్లో ఉండగా; ఈనెల 14న చెప్పులు వేసుకుంటుండగా రజత్‌ను పాము కరిచింది. ప్రతిసారీ కుటుంబ సభ్యులు అతడ్ని తీసుకెళ్లి చికిత్స చేయించారు. రజత్‌ను 'పాము వెంటాడడం' గురించి మన్‌కేఢా గ్రామస్థులు జోరుగా చర్చించుకుంటున్నారు. అనేక మంది అతడి ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.
రజత్ చాహర్‌కు గ్రామస్థుల పరామర్శ కుటుంబ సభ్యులు, స్నేహితులతో రజత్ చాహర్ మరోవైపు.. కాటేసిన పాముపై తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ వ్యక్తి. దానిని నోటితో కరిచి చంపేశాడు. చనిపోయిన సర్పాన్ని మెడలో వేసుకుని ఊరంతా షికార్లు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కర్ణాటకకు చెందిన లోకేశ్‌ది మరో కథ. వన్యప్రాణుల ప్రేమికుడైన లోకేశ్ ఇప్పటివరకు సుమారు 35,000 పాములను పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు. అయితే.. ఇటీవల నాగుపామును సంరక్షించే క్రమంలో కాటుకు గురై, చికిత్స పొందుతూ మరణించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.