ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అతడి బ్యాగ్​లపై డౌట్​.. ఓపెన్ చేస్తే 234 అరుదైన వన్యప్రాణులు.. ఎయిర్​పోర్ట్​ అధికారులు షాక్​! - జంతువుల స్మంగ్లింగ్

Smuggling Wild Animals Seized In Bengaluru : అరుదైన వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తూ ఓ వ్యక్తి కస్టమ్స్​ అధికారులకు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి ఊసరవెళ్లులు, తాబేళ్లు, కంగారు సహా తదితర జంతువులతో మొత్తం 234 వన్యప్రాణులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

Smuggling Wild Animals Seized In Bengaluru
Smuggling Wild Animals Seized In Bengaluru
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 12:33 PM IST

Smuggling Wild Animals Seized In Bengaluru :234 వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరు ఎయిర్ కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్టు చేసి రెండు ట్రాలీ బ్యాగుల్లోని వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

దేవనహళ్లి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 21న రాత్రి బ్యాంకాక్ నుంచి ఎఫ్‌డీ-137 విమానంలో ఓ ప్రయాణికుడు దిగాడు. అనంతరం గ్రీన్‌ ఛానల్‌ దాటి విమానాశ్రయం అరైవల్‌ ప్రాంతం నుంచి డిపార్చర్‌ గేట్‌ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో కస్టమ్స్​ అధికారులు అనుమానంతో అతడిని ఆపి.. రెండు ట్రాలీ బ్యాగులను తనిఖీ చేశారు. అందులో 234 వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

in article image
అక్రమంగా తరలిస్తున్న కంగారు పిల్ల

ఈ వన్యప్రాణుల్లో అరుదైన కొండచిలువలు, ఊసరవెళ్లులు, తాబేళ్లు, ఎలిగేటర్లు, కంగారు పిల్లతో సహా మొత్తం 234 వన్యప్రాణులు ఉన్నాయి. అనంతరం నిందితుడిని కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 104, కింద అరెస్టు చేశారు. రెండు ట్రాలీల్లోని వన్యప్రాణులను కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 110 కింద స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న వన్య ప్రాణులు

CITES Appendix 1 Species List :ఇందులో.. అంతరించిపోతున్న వన్యప్రాణులు, వృక్షాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన కన్వెన్షన్​ ఆన్​ ఇంటర్​నేషనల్​ ట్రేడ్​ ఇన్ ఎన్​డేంజర్డ్​ స్పెసీస్​ ఆఫ్​ వైల్డ్​ ఫోనా (Fauna), ఫ్లోరా (Flora) - (CITES)​ అప్పెండిక్స్​లో పేర్కొన్న కొన్ని వన్యప్రాణులు కూడా ఉన్నాయి.

గతేడాది ఝార్ఖండ్.. జంషెద్​పుర్​లోని టాటానగర్​ రైల్వేస్టేషన్​లో ఓ మహిళ అరుదైన పాములను తరలిస్తూ ఆర్​పీఎఫ్​ పోలీసులకు పట్టుబడింది. ఆ మహిళ నుంచి రూ. కోట్ల విలువైన 8 రకాల పాములు, సాలీళ్లు, నల్లని పురుగులు, బల్లులు ఉన్నాయి. అందులో సాండ్​ బోవా అనే పాము ధర అంతర్జాతీయ మార్కెట్​లో కొన్ని రూ.కోట్లలో ఉంటుందని తెలిసింది. అక్రమంగా తరలిస్తున్న వన్యప్రాణులను అటవీ శాఖకు అందజేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్​ చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్​పీఎఫ్​ అధికారులు వెల్లడించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఆమె బ్యాగ్​లో 22 పాములు, ఊసరవెల్లి.. ఎయిర్​పోర్ట్​లో అధికారులు షాక్

బంగాల్​ అడవుల్లో ఆస్ట్రేలియా కంగారూలు.. తీవ్ర గాయాలతో నరకం.. స్మగ్లర్ల పనే!

ABOUT THE AUTHOR

...view details