తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పుష్ప' సినిమా స్ఫూర్తితో ఎర్రచందనం స్మగ్లింగ్​.. ఏడుగురు అరెస్ట్ - smuggling in up inspired by Pushpa movie

యూపీలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మథుర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గోవర్ధన్ రోడ్డులో నిందితులందర్ని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు పోలీసులు. కాగా, పుష్ప సినిమా చూసి ఎర్రచందనం స్లగ్లింగ్​కు పాల్పడినట్లు నిందితులు తెలిపారు.

smuggling in up inspired by Pushpa movie
పుష్ప సినిమా చూసి ఎర్రచందనం స్మగ్లింగ్​

By

Published : Dec 20, 2022, 9:38 PM IST

పుష్ప సినిమా చూసి ఎర్రచందనం స్లగ్లింగ్​కు పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. సోమవారం సాయంత్రం ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని.. పోలీసులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఉత్తర్​ ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. మథుర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గోవర్ధన్ రోడ్డులో స్మగ్లర్లను అరెస్ట్​ చేశారు పోలీసులు.

అదుపులో నిందితులు

దుండగులు ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న విషయం ఇన్​ఫార్మర్ల ద్వారా పోలీసులకు అందింది. అనంతరం ఆగ్రా యూనిట్ ఎస్‌టిఎఫ్‌, మథుర హైవే పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఉమ్మడిగా దాడులు జరిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్​ చేస్తున్న దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 563.1 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్​లో దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. నిందితులపై కేసు నమోదు చేసి, జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు తప్పించుకున్నారని, వారిని సైతం వీలైనంత త్వరగా అరెస్ట్​ చేస్తామని వారు పేర్కొన్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న దుంగలు

నిందితులను దీపక్​, అజిత్​ కుమార్​, సుమిత్​, చంద్ర ప్రతాప్​, జితేంద్ర, రంజిత్​గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా పుష్ప సినిమా చూసి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు విచారణలో చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. అందులో చూపిన విధంగా తక్కువ సమయంలోనే ధనవంతులం కావాలనే లక్ష్యంతో స్మగ్లింగ్​కు పాల్పడ్డట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌ నుంచి అక్రమంగా ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుని మథుర, సమీప జిల్లాల్లోని మతపరమైన స్థలాల్లో అధిక ధరలకు సరఫరా చేసేవారని పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details