విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని (Gold Smuggling news) అధికారులు సీజ్ చేశారు. కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో 2.4 కిలోల బంగారాన్ని గుర్తించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), ఎయిర్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
ఈ విమానం షార్జా నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు (Gold Smuggling latest news) సంబంధించి విమానంలో పని చేసే మహిళా సిబ్బందిని అరెస్టు చేశారు. ఆమెను మలప్పురం ప్రాంతానికి చెందిన షహానాగా గుర్తించారు.