తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా కుమార్తెపై ఆరోపణలు ఉపసంహరించుకోవాలి..'.. కాంగ్రెస్​ నేతలకు స్మృతి లీగల్​ నోటీసులు - కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె

Smriti Irani daughter restaurant: అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ తన కుమార్తెపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ న్యాయపరమైన చర్యలకు దిగారు. తన కుమార్తెపై చేసిన ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. అలాగే రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నేతలకు లీగల్ నోటీసులు పంపారు.

smriti irani daughter restaurant
కాంగ్రెస్ పార్టీకి స్మతి ఇరానీ లీగల్ నోటీసులు

By

Published : Jul 25, 2022, 8:15 AM IST

Smriti Irani daughter restaurant: తన కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్‌ నడుపుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. తన కుమార్తెపై చేసిన ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. ఈ క్రమంలోనే బేషరతుగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలంటూ ముగ్గురు నేతలకు, కాంగ్రెస్‌ పార్టీకి లీగల్ నోటీసు పంపారు. ఇందులో పవన్ ఖేడా, జైరాం రమేష్, నెట్టా డిసౌజాలు ఉన్నారు. 'మంత్రిగా, ప్రజాజీవితంలోని వ్యక్తిగా ఉన్న మా క్లయింట్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, ఆమెతోపాటు ఆమె కుమార్తెను అగౌరవపరిచేందుకు తప్పుడు ఆరోపణలు చేశారు' అని నోటీసులో పేర్కొన్నారు. మంత్రి కుమార్తెకు గోవాలో బార్‌ నిర్వహణలో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మంత్రి కుమార్తె గోవాలో నడుపుతున్న రెస్టారంట్‌లో నకిలీ లైసెన్సుతో బార్‌ నడుపుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా శనివారం ఆరోపించారు. అయితే, తన క్లయింట్ ఎలాంటి రెస్టారంట్‌ను నడపడం లేదని, దానికి ఆమె యజమాని కాదని స్మృతి కుమార్తె తరఫు న్యాయవాది ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. మంత్రి సైతం.. కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ తప్పుడు ఆరోపణలపై కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. ఈ మేరకు తాజాగా లీగల్‌ నోటీసులు పంపారు.

ABOUT THE AUTHOR

...view details