తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దర్జాగా పడుకొని ఫ్లైట్​లో సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్​

Smoking in plane: స్పైస్‌ జెట్‌ విమానంలో సీట్లపై పడుకొని దర్జాగా సిగరెట్‌ కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దుబాయ్​ నుంచి దిల్లీకి వచ్చే విమానంలో ఈ ఘటన జరిగింది. గురుగ్రామ్‌కు చెందిన బల్విందర్‌ కటారియా అనే వ్యక్తి ఇలా చేశాడు. అయితే అతడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో పౌరవిమానయాన భద్రతను పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్‌ దృష్టికి రావడం వల్ల బల్విందర్ కటారియాపై కేసు నమోదు చేసింది.

Smoking Cigarette onboard SpiceJet
విమానంలో దర్జాగా పడుకొని సిగరెట్ స్మోకింగ్

By

Published : Aug 11, 2022, 4:10 PM IST

Smoking in plane: ఇటీవల విమాన ప్రయాణాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా నిబంధనలు అతిక్రమిస్తూ ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన విమాన ప్రయాణికులను విస్మయానికి గురిచేస్తోంది. స్పైస్‌ జెట్‌ విమానంలో సీట్లలో పడుకొని దర్జాగా సిగరెట్‌ కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం వల్ల స్పందించిన అధికారులు.. ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పౌరవిమానయానశాఖ పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.

గురుగ్రామ్‌కు చెందిన బల్విందర్‌ కటారియా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అతడికి ఇన్‌స్టాలో దాదాపు 6లక్షలకుపైగా ఫాలోవర్స్‌ కూడా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌ నుంచి దిల్లీకి వచ్చే స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణించిన ఆయన.. సీట్లలో ఠీవిగా పడుకొని సిగరెట్‌ కాల్చుతూ కనిపించాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అయితే, దీనిని ఓ యూజర్‌ ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. బాబీ కటారియాకు కొత్త రూల్స్‌ అంటూ ప్రశ్నించాడు. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, డీజీసీఏతోపాటు పౌరవిమానయాన భద్రతను పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్‌ ట్విటర్‌ హ్యాండిల్‌లకు ట్యాగ్‌ చేయడంతో అధికారులు స్పందించారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఐఎస్‌ఎఫ్‌.. ఇప్పటికే అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనిపై స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ మాత్రం స్పందించాల్సి ఉంది. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బాబీ కటారియా ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా మీడియాలో తనపై వార్తలు రావడంతో స్పందించిన కటారియా.. తన చర్యను సమర్థించుకోవడం గమనార్హం. ఇదిలాఉంటే, పొగ వల్ల క్యాబిన్‌లో పొంచివున్న ముప్పు, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగడం వంటి కారణాల దృష్ట్యా విమానం లోపల పొగత్రాగడంపై నిషేధం ఉంది.

ఇవీ చదవండి:'ఎన్నికల్లో ఉచితాల'పై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. పార్టీ గుర్తింపు రద్దుపై..

'సారీ.. మీ దగ్గర అప్పుడు రూ.700 కొట్టేశా.. ఇప్పుడీ డబ్బు తీసుకోండి!'

ABOUT THE AUTHOR

...view details