Rajkot Municipal Corporation news: కరోనా కట్టడిలో భాగంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో డోసు టీకా తీసుకోనివారే లక్ష్యంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. డిసెంబర్ 4 నుంచి 10 మధ్య రెండో డోసు తీసుకున్న లబ్ధిదారులకు స్మార్ట్‌ఫోన్ అందించనున్నట్లు ప్రకటించింది.
రాజ్‌కోట్‌లోని ఓ టీకా కేంద్రం Vaccination incentives Rajkot:
డ్రా నిర్వహించి ఒక లక్కీ విన్నర్‌ను ఎంపిక చేయనున్నట్లు రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమిత్ అరోడా తెలిపారు. విజేతకు రూ.50 వేల విలువైన స్మార్ట్‌ఫోన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
టీకా తీసుకుంటున్న లబ్ధిదారు లబ్ధిదారులతో పాటు వ్యాక్సినేషన్ సెంటర్లకు సైతం నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు అమిత్ వెల్లడించారు. డిసెంబర్ 4 నుంచి 10 మధ్య ఎక్కువ డోసులు అందించే అర్బన్ హెల్త్‌కేర్ సెంటర్లకు రూ.21 వేలు అందిస్తామని తెలిపారు. రెండో డోసు వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచేందుకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:మహిళా ఎమ్మెల్యేపై సీఎం అనుచిత వ్యాఖ్యలు!