SMART Missile Test: భారత నేవీ కోసం రూపొందించిన దీర్ఘశ్రేణి సూపర్‌సోనిక్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి ఈ క్షిపణి పరీక్షను అధికారులు చేపట్టారు. నేవీ కోసం ఆధునాతన ఆయుధ వ్యవస్థను రూపొందిస్తున్న డీఆర్డీఓ.. తాజాగా 'స్మార్ట్' పేరుతో సూపర్‌సోనిక్ క్షిపణిని తయారుచేసి విజయవంతంగా పరీక్షించింది.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జలాంతర్గాముల్లో పైనుంచి టార్ఫిడోలను ప్రయోగించేందుకు వీలుగా.. ఈ క్షిపణి వ్యవస్థను రూపొందించారు. ఈ పరీక్షలో క్షిపణి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగిందని.. డీఆర్డీఓ అధికారులు తెలిపారు.